News April 19, 2025
సిద్దిపేట: తల్లీ, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు

తల్లీ, కొడుకు అదృశ్యమైన ఘటన జగదేవ్‌పూర్(M)లో జరిగింది. స్థానికుల వివరాలు.. దౌలాపూర్‌కు చెందిన లావణ్యను పదేళ్ల కింద గజ్వేల్(M) కొల్గురుకు వాసి కృష్ణతో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో లావణ్య చిన్న కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గురువారం రాత్రి నుంచి లావణ్య కనిపించకపోవడంతో శుక్రవారం తండ్రి మల్లయ్య PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 20, 2025
DSC: కర్నూలు జిల్లాలో పోస్టులు ఇలా..

కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను <<16155948>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 82
➤ హిందీ:114 ➤ ఇంగ్లీష్: 81
➤ గణితం: 90 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 74 ➤ సోషల్: 112
➤ పీఈటీ: 209 ➤ఎస్జీటీ: 1,817 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 4, జీవశాస్త్రం 4, సోషల్ 2, పీఈటీ 2, ఎస్జీటీ 10 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.
News April 20, 2025
మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.
News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.