News December 21, 2025
సిద్దిపేట: తీవ్ర విషాదం.. దంపతుల ఆత్మహత్య

పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకిలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని దాచారానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు. వారు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం భార్యాభర్తలు పురుగు మందు తాగారు. ఘటనా స్థలంలో భార్య మృతి చెందగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 25, 2025
పుణే పోరు: ఓటుకు కారు.. థాయిలాండ్ టూరు!

పుణే మున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను వరాల జల్లుతో ప్రలోభపెడుతున్నారు. థాయిలాండ్ ట్రిప్పులు, ఖరీదైన కార్లు, ప్లాట్లు, బంగారం వంటి ఆఫర్లు ఇస్తున్నారు. మహిళల కోసం చీరలు, కుట్టు మిషన్లు పంచుతున్నారు. క్రికెట్ టోర్నీలు పెట్టి నగదు బహుమతులు ప్రకటిస్తున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై పవార్ వర్గాల మధ్య చర్చలు జరుగుతుంటే ఠాక్రే సోదరులు ఒక్కటవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
News December 25, 2025
ASF: స్లాట్‌కు 5 క్వింటాళ్లు మాత్రమే విక్రయం

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం పత్తి రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించిందని ASF జిల్లా మార్కెటింగ్ అధికారి అష్పక్ తెలిపారు. CCI వారి ఆదేశాల ప్రకారం స్లాట్ బుకింగ్ నిబంధనలలో మార్పు జరిగిందని.. ఈ నెల 25వ తేదీ నుంచి బుక్ చేసిన స్లాట్‌కు 5 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నారు.
News December 25, 2025
చైనా మాంజాపై అమ్మితే కఠిన చర్యలు: ASF ఎస్పీ

చైనా మాంజా అత్యంత ప్రాణాంతకమని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. వాహనదారులకు ఇది తీవ్ర ప్రమాదమని తెలిపారు. చైనీస్ మాంజా అమ్మకం, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని.. ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని వివరించారు. ఎవరైనా జిల్లాలో మాంజా అమ్మితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.


