News January 5, 2026
సిద్దిపేట: తీవ్ర విషాదం.. యువ డాక్టర్ సూసైడ్

సిద్దిపేట పట్టణంలో ఆత్మహత్యాయత్నం చేసిన యువ డాక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు సిద్దిపేట మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్న డాక్టర్ లావణ్య శనివారం గడ్డి మందును తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం HYDకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 6, 2026
ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?

AP: రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఇప్పటికే కొనసాగుతున్న 62ఏళ్లు పైబడిన 2,831మంది ఉద్యోగులపై దృష్టి సారించారు. వయోపరిమితి పెంపుతో పడే అదనపు భారాలపై వివరాలు సేకరించి మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
News January 6, 2026
RCFLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News January 6, 2026
మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.


