News February 23, 2025
సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
Similar News
News February 23, 2025
న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. మళ్లింపు

అమెరికాలోని న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ AA292ను ఇటలీలోని రోమ్ నగరానికి మళ్లించారు. తుర్కియే వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
News February 23, 2025
బాలానగర్‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 23, 2025
రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు శంకర్‌పల్లి మండలంలో 37.8℃, మొయినాబాద్ 37.4, ఫరూఖ్ నగర్ 37.3, ఇబ్రహీంపట్నం 37.2, కేశంపేట 37.2, హయత్ నగర్ 37.1, సరూర్‌నగర్ 37.1, శేరిలింగంపల్లి 37, కొందుర్గ్ 36.9, షాబాద్ 36.6, తలకొండపల్లి 37, అబ్దుల్లాపూర్మెట్ 35.8, నందిగామ 35.8, చేవెళ్ల 35, రాజేంద్రనగర్ 36.1, శంషాబాద్ 35.5, బాలాపూర్ 35.6, కందుకూరు 36.2, మహేశ్వరం 35.5℃గా నమోదైంది.