News March 4, 2025
సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.
Similar News
News January 8, 2026
KMR: టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు

టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశానికి KMR జిల్లా డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ కార్యాచరణ, ప్రజా సమస్యల పోరాటంపై సమావేశంలో చర్చించారు. మల్లికార్జున్ జిల్లా పరిస్థితులు, ప్రజల ఆకాంక్షలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
News January 8, 2026
GNT: కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా?

గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్గా పల్నాడు జిల్లాకు చెందిన కుర్రా అప్పారావు నియామకంపై స్థానిక క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన అర్హులను పక్కనపెట్టి ఇతర జిల్లా నేతకు పదవి అప్పగించడంపై కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది స్థానిక క్యాడర్కు అన్యాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం డైరెక్టర్ పదవులైనా స్థానికులకు కేటాయిస్తారా? అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది.
News January 8, 2026
విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.


