News February 8, 2025
సిద్దిపేట: దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దగా: హరీశ్ రావు
దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’లో మండిపడ్డారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు విలువ లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో గందరగోళం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు.
Similar News
News February 8, 2025
BJPకి ఓట్ల వర్షం.. 27 ఏళ్ల కల నెరవేరిన వేళ
PM మోదీ ‘డబుల్ ఇంజిన్’ నినాదం పని చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో BJP 27 ఏళ్ల కల నెరవేరింది. 1998లో BJP చివరి CMగా సుష్మాస్వరాజ్ పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్‌లే దేశ రాజధానిని ఏలాయి. ఆప్ అగ్రనేతలపై అవినీతి మచ్చ, కాంగ్రెస్ ప్రభావం లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చాయి. ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పడంతో BJPకి ఓట్ల వర్షం కురిసింది.
News February 8, 2025
ఢిల్లీ సచివాలయంలో ఆంక్షలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో AAP ఓటమి ఖాయమైంది. దీంతో సచివాలయంలో ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఏ ఒక్క ఫైల్ కూడా అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేయడం, తాము అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో తాజా ఆదేశాలు కీలకంగా మారాయి.
News February 8, 2025
NGKL: చెట్టు పైనుంచి జారిపడి గీతా కార్మికుడు మృతి
నాగర్ కర్నూల్ మండలంలోని నాగనూల్ గ్రామంలో చెట్టుపై నుంచి పడి గీతాచార్యుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(58) రోజు మాదిరిగానే ఈత చెట్టు ఎక్కి గీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపు మార్గమధ్యలో మృతి చెందాడు.