News March 12, 2025
సిద్దిపేట: దివ్యాంగులు ధైర్యంగా ఉండాలి: డీఈఓ

దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా మానసిక స్తైర్యంతో ఉండాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవన్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 57 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. దివ్యాంగులు ఉపకరణాలు ఉపయోగించి మానసికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
Similar News
News December 17, 2025
ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం నిజాంపట్నం మండలం, దిండి పంచాయతీలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ భూ లెవెల్ పనులను ఆయన పరిశీలించారు. KWD ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పంతాని మురళీధర్ రావుతో కలిసి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సత్య ప్రసాద్ చొరవతో పనులు వేగవంతం చేస్తామన్నారు.
News December 17, 2025
10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు: రైల్వే బోర్డు

రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. ఇన్నాళ్లూ 4 గంటల ముందు చార్టును అందుబాటులో ఉంచేది. దీంతో స్టేషన్‌కు రావడం, ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం వంటి ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు.
News December 17, 2025
భద్రాద్రి: ‘ఒక్క’ ఓటుతో వరించిన సర్పంచి పీఠం

జూలూరుపాడు మండలం నలబండబొడు ఎన్నికల ఫలితం ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించింది. ఇక్కడ BRS మద్దతుదారు గడిగ సింధు కేవలం ఒక్క ఓటు మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి బచ్చల ఝాన్సీరాణిపై విజయం సాధించారు. ఆ గ్రామపంచాయతీలో మొత్తం 144 ఓట్లు కాగా నేటి పోలింగ్‌లో 139 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థినికి 69 ఓటు రాగా 70 ఓట్లు సింధూకి పోలయ్యాయి. ఒకే ఒక్క ఓటుతో సింధు గెలవడంతో BRS శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.


