News February 23, 2025

సిద్దిపేట: నేడే గురుకుల పరీక్ష

image

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2025

టన్నెల్‌లో బయటపడ్డ కార్మికుడి చెయ్యి

image

TG: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారి ఆచూకీని సహాయక బృందాలు కనుగొన్నాయి. టన్నెల్‌లో 14వ కి.మీ వద్ద మట్టి దిబ్బల్లో ఓ కార్మికుడి చేయి బయటపడింది. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మందిలో ఎంత మంది ప్రాణాలతో ఉన్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా బురదలో కూరుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రెస్క్యూను ముమ్మరం చేశాయి.

News February 23, 2025

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : ADB MP

image

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిన్నమయల్ అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని ADB ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం మామడ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నాయకులు చందు, నారాయణ రెడ్డి, బాపురెడ్డి, రాజారెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.

News February 23, 2025

రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!