News February 10, 2025
సిద్దిపేట: ‘నేషనల్ హైవే రోడ్ పనులు వేగంగా పూర్తి చేయాలి’

నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నేషనల్ హైవే ఇంజనీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News January 10, 2026
రేపే మ్యాచ్.. రిషభ్ పంత్‌కు గాయం!

రేపు న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి నడుము పైభాగంలో తాకినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే ఆయన మైదానాన్ని వీడగా సపోర్ట్ టీమ్ చికిత్స అందించినట్లు తెలిపాయి. అయితే గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం తీవ్రత ఎక్కువైతే రేపు వడోదరలో జరిగే తొలి వన్డేలో పంత్ ఆడేది అనుమానమే.
News January 10, 2026
సంక్రాంతి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి: మణుగూరు డీఎస్పీ

సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు DSP రవీందర్ రెడ్డి సూచించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచవద్దని, సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
News January 10, 2026
నల్గొండ ఖాకీల ‘కోడి’ విందు

పందెం రాయుళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఖాకీలు.. వారు పట్టుకున్న కోళ్లనే కుమ్మేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ టూ టౌన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ వాళ్లు స్వాధీనం చేసుకున్న పందెంకోళ్లు మాయమవ్వడం సంచలనంగా మారింది. సాక్ష్యాధారాల కింద కోర్టుకు పంపాల్సిన కోళ్లను, కొందరు పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా విందు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ‘కోడి మాయాజాలం’పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.


