News March 26, 2025
సిద్దిపేట: ‘పట్టుదల, లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమే’

పట్టుదల, స్పష్టమైన లక్ష్యం, నిర్దిష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే సివిల్ సర్వీసెస్ పరీక్షలు సులభంగా పాస్ కావచ్చని సిద్దిపేట కలెక్టర్ ఎం.మనుచౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని తెలంగాణ స్కిల్ & నాలెడ్జ్ సెంటర్, కెరీర్ అండ్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Similar News
News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లి గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News March 27, 2025
సిరిసిల్ల: ‘ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టవద్దు’

ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టవద్దని ప్రజా భవన్ నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. ప్రజా భవన్ ప్రజావాణి దరఖాస్తులు, ఎన్ బీఎఫ్ఎస్ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు.
News March 27, 2025
సిరిసిల్ల: మాదకద్రవ్యాలను నిర్మూలించాలి: కలెక్టర్

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని గురువారం కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే సమక్షంలో అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలన్నారు.