News September 17, 2025

సిద్దిపేట: పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: సీపీ

image

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మిర్జా యూసుఫ్ బేగ్ ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందడంతో సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐని ఆమె అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్దతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి గుర్తింపు, మర్యాద లభిస్తాయన్నారు. రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.

News September 17, 2025

హైడ్రాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

image

హైడ్రాలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజల సాధకబాధకాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు.

News September 17, 2025

తిరుమలకు బైకుల నిలిపివేత

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 28న జరిగే గరుడసేవకు టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 27న రాత్రి 9 గంటల నుంచి 29న సాయంత్రం 6 గంటల వరకు టూవీలర్స్‌ను కొండపైకి అనుమతించరు. రెండు ఘాట్ రోడ్డులో బైకుల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. అలిపిరి వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించింది. అలాగే ఈనెల 28న గరుడ సేవ రోజున రెండు నడక మార్గాలు 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు.