News November 10, 2025

సిద్దిపేట: పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్ర మంత్రి

image

మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.1,41,025 మొత్తాన్ని చెల్లించారు. పరీక్ష ఫీజు చెక్కును కలెక్టర్ హైమావతికి బీజేపీ నాయకులు అందజేశారు.

Similar News

News November 10, 2025

తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

image

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR న‌ష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు త‌క్ష‌ణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. ఉద్యాన‌, మ‌ల్బ‌రీ తోట‌లూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ ప‌నులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లిందని తెలిపారు.

News November 10, 2025

KMR: కలెక్టరేట్‌లో ప్రజావాణికి 80 అర్జీలు

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 80 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం ఆయన సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరిధిలో పరిష్కరించలేని సమస్యలపై దరఖాస్తుదారులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.

News November 10, 2025

రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా

image

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్‌గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.