News October 24, 2025
సిద్దిపేట: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్‌ను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందనీ జిల్లా అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HM లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. HMలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలని అన్నారు.
Similar News
News October 24, 2025
కర్నూల్ ప్రమాదం.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులు సేఫేనా?

కర్నూల్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు <<18087723>>ప్రవేట్ ట్రావెల్స్<<>> బస్సులను ఆశ్రయిస్తారు. ఘటనలు జరిగినప్పుడు ఈ ట్రావెల్స్ బస్సులు ఎంత వరకు సేఫ్ అన్నదానిపై చర్చ నడుస్తోంది. కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు తీరిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశంలో ట్రావెల్స్ బస్సులు అంతా ఫిట్‌గా ఉన్నాయా.?
News October 24, 2025
ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
News October 24, 2025
మెదక్: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాయికాడి రాజమణికి కౌడిపల్లి బస్టాండ్ వద్ద బస్సులో గుండెపోటు వచ్చింది. బంధువులు కౌడిపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.


