News July 10, 2025
సిద్దిపేట: పరుగుతోనే జీవితం మెరుగు: TUWJ

పరుగుతోనే జీవితం మెరుగవుతుందని టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి అన్నారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించే మూడో ఎడిషన్ హాఫ్ మారథాన్ రన్ గోడపత్రికను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్‌లతో కలిసి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. హాఫ్ మారతాన్ రన్‌కు జర్నలిస్టుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
Similar News
News July 10, 2025
MDCL: రూమ్ మార్చేసాం.. ఫ్రీ కరెంట్ కోసం ఏం చేయాలి.?

ఉప్పల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కిరాయికి ఉండే వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలవుతుంది. అయితే వారు రూమ్ ఖాళీ చేసి, వేరే ప్రాంతానికి వెళ్లి కిరాయి ఉంటున్న సమయంలో ఇబ్బందులు కలుగుతున్నట్లు పలువురు తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రాంతంలో 200 యూనిట్ల ఉచిత కరెంటు పొందడం కోసం ఏం చేయాలి.? అనేది తెలియటం లేదని, అధికారులు స్పందించాలని కోరారు.
News July 10, 2025
టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్?

TG: ప్రభుత్వ బడుల్లో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేడు క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం సక్సెస్ అయిందని అధికారులు తెలిపారు. దీని ద్వారా టీచర్లు టైమ్‌కు స్కూల్‌కు వస్తారని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు.
News July 10, 2025
పటాన్‌చెరులో స్కూల్ బస్సు దగ్ధం

సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే విద్యార్థులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పాక్షికంగా కాలిపోగా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.