News November 26, 2025

సిద్దిపేట: పల్లెపోరు.. రేపటి నుంచి నామినేషన్స్

image

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సగారా మోగింది. రేపటి నుంచి ఈనెల 29 వరకు మెదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 23 మండలాల్లో 508 గ్రామాలు, 4508 వార్డులు ఉన్నాయి. మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,21,766, మహిళలలు 3,34,186, ఇతరులు 6 మంది ఉన్నారు. ఎన్నికలు మూడు విడతల్లో జరగనుండగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటుంది.

Similar News

News November 26, 2025

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.

News November 26, 2025

ములుగు: అధికార పార్టీలో అభ్యర్థిత్వంపై పోటీ..!

image

ములుగు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు బరిలో ఉండాలనే విషయంపై పోటీ నెలకొంది. కాంగ్రెస్ పవర్‌లో ఉండటంతో ఆ పార్టీలోనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇద్దరి కంటే ఎక్కువమంది పోటీకి ఆసక్తి చూపుతుండగా నేతలకు తలనొప్పిగా మారింది. జనరల్ రిజర్వేషన్, మేజర్ పంచాయతీలలో ఈ పరిస్థితి ఉంది. ముఖ్య నేతలు సర్దుబాటు చేయకుంటే తిప్పలు తప్పేలా లేవు. మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు.

News November 26, 2025

వనపర్తి: TCC పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని బుధవారం తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్,ఎంబ్రాయిడరీలో లోయర్, హాయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజును ఈనెల 5 వరకు చెల్లించాలని అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 12 వరకు అలాగే రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.