News February 12, 2025

సిద్దిపేట: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు శాటిలైట్ సేవలు, AIని వినియోగించనుంది. దీంతో నిర్మాణ స్థల అక్షాంశ, రేఖాంశ సంఖ్యలను ఖరారు చేసి శాటిలైట్‌కు అనుసంధానం చేస్తారు. ఈ నిర్మాణాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలించే అవకాశం ఉంది. నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేశాకే అర్హులకు బిల్లులు అందనున్నాయి.

News February 12, 2025

NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.

News February 12, 2025

NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.

error: Content is protected !!