News August 18, 2024
సిద్దిపేట: పిల్లలతో సహా తల్లి సూసైడ్?

చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా ములుగు(M)కి చెందిన భానుప్రియ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం పిల్లలతో ఇంటి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నిన్న రాత్రి శామీర్‌పేట చెరువులో వేదాంశ్(5), భానుప్రియ మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 10, 2025
ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.
News November 10, 2025
మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 75 దరఖాస్తులు

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 34, పింఛన్లకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 05, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 26 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
మెదక్: ఆర్మీకి ఆర్ధికంగా సహకరిద్దాం: అదనపు కలెక్టర్

ఆర్మీకి సహాయ సహకారాలు, ఆర్ధికంగా సహకరిద్దామని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారోత్సవాల్లో భాగంగా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. ఆవిష్కరించిన స్టిక్కర్స్‌ను పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు విక్రయించగా వచ్చే డబ్బులను ఆర్మీ, సహాయ సహకారాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.


