News April 14, 2025
సిద్దిపేట: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 15, 2025
సంగారెడ్డి: 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం 17 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీర్గాపూర్ మండలం కడపలో 41.1 డిగ్రీలు నమోదు కాగా.. పటాన్ చెరు మండలం పాశమైలారంలో 40.8, చౌటకూరు, జిన్నారం, కోహీర్ మండలం దిగ్వాల్ 40.7, కల్హేర్, ఖేడ్ 40.6, వట్టిపల్లి, పుల్కల్ 40.5, వట్టిపల్లి మండలం పాల్వంచ 40.4, జహీరాబాద్, కంగ్టి, హత్నూర మండలం గుండ్ల మాచనూరు 40.3 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
News April 15, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News April 15, 2025
శ్రీకాకుళం: ఏపీ మోడల్ పాఠశాల పరీక్షల తేదీ మార్పు

ఏపీ మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు తేదీ ఏప్రిల్ 21కి మార్పు జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీన “ఈస్టర్” పండగ ఉండటం వలన తేదీ మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గల 13 మోడల్ పాఠశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 21కి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.