News January 7, 2026
సిద్దిపేట: పెళ్లికి కులం అడ్డంకి.. యువ డాక్టర్ ప్రాణం బలి!

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ <<18764829>>లావణ్య<<>>(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్‌కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.వివాహం చేసుకుంటానని చివరికి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్ పై సిద్దిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Similar News
News February 18, 2026
హోలీ కానుకగా డీఏ పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ(మార్చి 4) కానుకగా DA పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 58% ఉండగా మరో 2% పెరగొచ్చని అంచనా. ఇది JAN నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ్గా, ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది. 2007, 2018, 2025లోనూ రెండు శాతమే నమోదైంది. కాగా <<18718812>>8వ వేతన సంఘం<<>> ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
News February 18, 2026
క్రీడా ప్రతిభకు వన్నె తెచ్చేలా ప్రభుత్వం కృషి: కలెక్టర్

క్రీడా ప్రతిభకు వన్నె తెచ్చేలా ప్రభుత్వం కృషిచేస్తోందని..ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడా ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-13,15,17,19 విభాగాల్లో బాలురు,బాలికలకు జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్, సెలక్షన్స్ నిర్వహించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావలన్నారు.
News February 17, 2026
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఉప్పల్‌వాయి యువకుడు మృతి

రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన జంగిటి రాజు మంగళవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వెన్నెల డిబేట్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


