News January 30, 2025
సిద్దిపేట: పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు: సీపీ

పోక్సో కేసులో నేరస్థుడికి 20ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సాయి రమాదేవి తీర్పును ఇచ్చారని సీపీ బి. అనురాధ తెలిపారు. త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని పొన్నాలలో ఓ ఇంట్లో యూపీలోని గోరఖ్‌పూర్ తాలుకా రసూలాపూర్‌కు చెందిన అజయ్(30) 2024 ఆగస్టు 19న బాలికపై అత్యాచారం కేసులో తీర్పును వెలువరించినట్లు తెలిపారు. నిందితులు తప్పించుకోలేరని, 5 నెలల్లోనే కేసు పూర్తయిందన్నారు.
Similar News
News July 4, 2025
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు: కలెక్టర్

సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగుల అవసరాలను తీర్చడంలో సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందన్నారు. సామాజిక సంక్షేమం పట్ల ఎస్పీఎం యాజమాన్యం తీరును అభినందించారు.
News July 4, 2025
నల్గొండ: మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన

IPR సెల్ MGU నల్గొండ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, TG స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. విద్యార్థులు వినూత్న ఆలోచన, ఆచరణాత్మక దృక్పథానికి, క్రమశిక్షణ తోడైతే ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలుగా ఎదిగి పేటెంట్ సాధించడం సులువు అని అన్నారు.
News July 4, 2025
‘కోడిగుడ్ల సరఫరాకు వివరాలు ఇవ్వండి’

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లా స్థాయి కోడిగుడ్ల సేకరణ, కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల, ఆశ్రమ, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు, ఫూలే పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు అందించేందుకు వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.