News April 9, 2025
సిద్దిపేట: పోషన్ అభియాన్ జయప్రదం చేయాలి

పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఎసిఎల్బి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ పోషకాహారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 17, 2026
ఇమ్రాన్ కోసం కపిల్, గవాస్కర్ సహా 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మంచి సదుపాయాలు, చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వానికి 14 మంది మాజీ క్రికెటర్లు ‘అంతర్జాతీయ మాజీ క్రికెట్ కెప్టెన్స్’ పేరిట లేఖ రాశారు. ఇందులో భారత లెజెండ్స్ కపిల్ దేవ్, గవాస్కర్ కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించిందని, కుడి కన్ను 85% చూపు కోల్పోయిందని ఇటీవల వార్తలొచ్చాయి. పాక్‌కు 1992 WC అందించిన ఇమ్రాన్, 2018-2022 మధ్య PMగా ఉన్నారు.
News February 17, 2026
పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీని మాత్రం ఎంపీ రఘునందన్ రావు తన కో-ఆప్షన్ ఓటుతో దక్కించుకోవడం విశేషం. నియోజకవర్గ రాజకీయాల్లో ఈ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.
News February 17, 2026
ఉద్యానవన సాగు విస్తరణ లక్ష్యాలను సాదించాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా సాగు విస్తరణ లక్ష్యాలను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాల లక్ష్యాల ప్రగతిపై మంగళవారం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులను ప్రోత్సహించే లక్ష్యం చేరుకోవాలన్నారు.


