News October 27, 2025
సిద్దిపేట ప్రజావాణికి 168 దరఖాస్తులు

ప్రజావాణిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాగా నేడు మొత్తం 168 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 27, 2025
మద్యం షాపుల కేటాయింపునకు డ్రా పూర్తి: HYD కలెక్టర్

హైదరాబాద్‌లో 82, సికింద్రాబాద్‌లో 97 మద్యం షాపుల కేటాయింపునకు డ్రా పూర్తయిందని జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవన్‌లో లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు జరిపారు. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. రానున్న 2 సంవత్సరాలకు షాపులు కేటాయించినట్లు తెలిపారు.
News October 27, 2025
WWC: ప్రతీకా స్థానంలో షెఫాలీ వర్మ!

మహిళా వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో గాయపడిన భారత ఓపెనర్ ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి రానున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 30న జరిగే సెమీఫైనల్లో ఆమె జట్టులో చేరుతారని ESPN పేర్కొంది. కాగా గాయం కారణంగా ప్రతీకా టోర్నీలో మిగతా మ్యాచులకు దూరమయ్యారని వెల్లడించింది. దూకుడుగా ఆడే ప్లేయర్‌గా పేరున్న షెఫాలీ రాకతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News October 27, 2025
జగిత్యాల: రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.


