News February 3, 2025
సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO
ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.
Similar News
News February 3, 2025
పరీక్ష లేకుండానే లక్షన్నర జీతంతో ఉద్యోగాలు
NTPCలో 475 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్‌లో 65శాతం పర్సెంటేజీ కలిగి ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ బట్టి వయోపరిమితి ఉంది. అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఈ నెల 13 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. జీతం గరిష్ఠంగా రూ.1,40,000. <
News February 3, 2025
బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు: ఆర్. కృష్ణయ్య
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని MP ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘KCR చేసిన సర్వేలో 52% BCలు ఉన్నారు. మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బీసీలు ఉన్నట్లు చూపిస్తోంది. BCల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు BCలకు అన్యాయం చేస్తున్నారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలి’ అని కోరారు.
News February 3, 2025
నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు
నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేట కలక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న అన్ని స్కూల్స్, సంక్షేమ హాస్టళ్లలలో మాత్రలు వేయించాలన్నారు.