News October 24, 2025

సిద్దిపేట: ప్లేస్కూల్ సామగ్రి టెండర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

సిద్దిపేట కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో కొత్తగా 51 ప్లే-స్కూల్‌లలో కావాల్సిన సామగ్రి టెండర్ ప్రక్రియను కలెక్టర్ కె.హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 51 ప్లే-స్కూల్‌లలో కావాల్సిన సామగ్రి ఆట వస్తువులు, ఛైర్స్, టేబుల్స్ ఇతరత్ర వస్తువులను 8 కంపెనీ ప్రతినిధులు వారు తయారు చేసిన వస్తువులు ప్రదర్శించారు.

Similar News

News October 25, 2025

NLG: బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారో..!

image

డీసీసీలు ఇవాళ ఖరారు కానున్నారు. ఢిల్లీలో అధిష్ఠానంతో రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను యూనిట్‌గా తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎంతమంది ఉండాలన్నది నిర్ణయించి అధ్యక్షులను ఖరారు చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

News October 25, 2025

డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

AP: డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఖాళీలను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీకి SCERT నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. వచ్చే నెల 5-8 వరకు రాత పరీక్షలు నిర్వహించి, 13న రిజల్ట్స్ వెల్లడిస్తామని తెలిపింది. అనంతరం త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని వెల్లడించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.

News October 25, 2025

NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

image

బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.