News February 23, 2025

సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

Similar News

News February 23, 2025

INDvsPAK మ్యాచ్ చూస్తున్న మంత్రి లోకేశ్, చిరు

image

ఏపీ మంత్రి నారా లోకేశ్, చిరంజీవి, ఎంపీ కేశినేని చిన్ని, ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్ తదితరులు దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచును వీక్షిస్తున్నారు. లోకేశ్, కేశినేని చిన్ని, సుకుమార్ కుటుంబ సభ్యులు టీమ్ ఇండియా జెర్సీని ధరించి స్టేడియానికి వచ్చారు.

News February 23, 2025

HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

image

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్‌నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ  ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.

News February 23, 2025

నిలకడగా ఆడుతున్న పాక్.. షకీల్ ఫిఫ్టీ

image

భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోగా ఆ తర్వాత వచ్చిన షకీల్(50*), రిజ్వాన్(41*) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు.

error: Content is protected !!