News October 9, 2025

సిద్దిపేట: ‘బాండ్ పేపర్ పై సంతకం చేసి పోటీ చేయాలి’

image

సిద్దిపేట జిల్లా నంగునూర్ మంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు బాండ్ పేపర్ పై సంతకం చేయాలని యువత నిర్ణయం తీసుకుంది. రూ.100 బాండ్ పేపర్ పై ‘అక్రమ ఆస్తులు సంపాదించనని, ఐదేళ్ల తర్వాత ఆస్తులు పెరిగితే గ్రామానికి అప్పగిస్తామని, జీపీ పనుల కోసం ప్రజల దగ్గర డబ్బులు అడగనని, తప్పుడు లెక్కలు చూపనని, గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తాను’ అని రాసి బాండ్‌లో పేర్కొన్నారు.

Similar News

News October 10, 2025

కంచరపాలెం చోరీ కేసులో వీడిన చిక్కుముడి?

image

కంచరపాలెం ఇందిరానగర్-5 <<17927881>>దొంగతనం కేసు<<>>లో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయినట్లు సమాచారం. బాధిత కుటుంబంలో ఓ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనే పథకం ప్రకారం ఈ దోపిడీకి ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నెల 5 అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యమ్మ(73)నోట్లో గుడ్డలు కుక్కి 12 తులాల బంగారు, కారు, కొంత నగదుతో దుండగలు పరారయ్యారు. కంచరపాలెం క్రైంపోలీసులు కేసును తమైదన శైలిలో విచారిస్తున్నారు.

News October 10, 2025

ఈ దగ్గు సిరప్‌ నిషేధం

image

‘RespiFresh-TR’ దగ్గు సిరప్‌లో నిషేధిత DEG సాల్వెంట్ 35 శాతం పైగా ఉండటంతో ప్రభుత్వం నిషేధించిందని ఔషధ నియంత్రణ శాఖ కర్నూలు డీడీ నాగ కిరణ్ కుమార్ తెలిపారు. ఆ సిరప్‌‌ను టెస్ట్ చేసినప్పుడు, రెండు కంపెనీల మందుల్లో నిషేధిత DEG సాల్వెంట్ బయట పడిందన్నారు. ఇందులో ‘RespiFresh-TR’ సిరప్ ఏపీ మార్కెట్లోకి వచ్చినట్లు గుర్తించామన్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో కొన్ని బాటిళ్లను గుర్తించి రిటర్న్ చేశామన్నారు.

News October 10, 2025

రెండో టెస్టు.. భారత్ బ్యాటింగ్

image

వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (C), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.