News April 13, 2025

సిద్దిపేట: బాలల అశ్లీల వీడియోలు పోస్ట్.. యువకుడి అరెస్ట్

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుబ్బాక పోలీసులు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.

Similar News

News February 12, 2026

ఆంధ్రప్రదేశ్‌కు అంతరిక్ష సాంకేతిక మద్దతు: కేంద్రమంత్రి

image

గత ఐదు సంవత్సరాలలో ఇస్రో/ఎన్‌ఆర్‌ఎస్‌సి ద్వారా ఏపీకి పలు రంగాల్లో అంతరిక్ష సాంకేతిక మద్దతు అందించామని కేంద్ర రాష్ట్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉపగ్రహాల ద్వారా పంట విస్తీర్ణం, దిగుబడి అంచనా, కరువు దుర్బలత్వ అంచనా, YES-TECH ద్వారా టెక్నాలజీ ఆధారిత దిగుబడి లెక్కింపు, AgriStack కోసం హై రిజల్యూషన్ డేటా అందజేశామన్నారు.

News February 12, 2026

వేములవాడ: లెక్కల్లో మునిగిన అభ్యర్థులు

image

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు. ఎన్నికల పోలింగ్ సరళి, పోలైన ఓట్ల శాతం విశ్లేషిస్తూ గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల సానుకూలతకు తోడు వ్యక్తిగతంగా తమ చరిష్మా, ఓటర్లకు అందించిన తాయిలాలు తమ గెలుపునకు బాటలు వేస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం 28 వార్డుల్లో పోటీ చేసిన 113 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది.

News February 12, 2026

ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.