News August 10, 2025

సిద్దిపేట: ‘బాల సాహిత్యంపై పరిశోధన జరగాలి’

image

బాల సాహిత్యంపై పరిశోధన జరగాలని కవి ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎడ్ల లక్ష్మి, కాల్వ రాజయ్య అన్నారు. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలగేయ సాహిత్యంపై పరిశోధన చేస్తున్న సిద్దిపేటకు చెందిన బాల సాహిత్య రచయిత సతీష్‌ను కలిసి మాట్లాడారు. బాల సాహిత్యానికి సిద్దిపేట జిల్లా తరపున సహకారం ఉంటుందన్నారు. బడి పిల్లల చేత రచనలు చేయిస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీపించడానికి రచయితల కృషి చేయాలన్నారు.

Similar News

News August 10, 2025

భువనగిరి: ‘ఆ రోజుల్లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు’

image

సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఈనెల 19 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

News August 10, 2025

NRPT: ‘సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. పెరుగుతున్న అధునాతన టెక్నాలజీ వాడుకొని సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయకూడదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఏటీఎం కార్డు నంబర్ చెప్పకూడదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

News August 10, 2025

సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం: కోదాడ MLA

image

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. ఆదివారం కోదాడలో చిరంజీవి యూత్ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండె పంగు రమేశ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీల విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.