News February 3, 2025

సిద్దిపేట: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మోహాన్ రెడ్డి

image

సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సిద్దిపేట పట్టణానికి చెందిన గంగాడి మోహన్ రెడ్డిని మరోసారి నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయనకే మరో సారి భాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 12, 2025

గుంటూరు రైల్వే, బస్టాండ్‌లలో భద్రతా తనిఖీలు

image

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానును, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమానిత వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

News November 12, 2025

కరీంనగర్: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

image

సమాజంలో అవినీతి పెద్ద సమస్యగా మారిందని, దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందిని ఉమ్మడి కరీంనగర్‌ ACB డీఎస్‌పీ విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. లంచం అడగడం.. లంచం తీసుకోవడం.. లంచం ఇవ్వడం కూడా నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

News November 12, 2025

NRPT: ‘ప్రజల ఆశ, అత్యాశే మోసగాళ్ల ఆయుధం’

image

డబ్బుపై ప్రజలకు ఉండే ఆశ, అత్యాశే సైబర్ మోసగాళ్లకు ఆయుధాలని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసంలో నష్టపోయి బాధపడటం కంటే అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. స్మార్ట్‌ఫోన్‌లకు వచ్చే అనవసరపు లింకులు, ఏపీకే ఫైల్స్‌ను తెరవకుండా ఉండటం మంచిదని సూచించారు. ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.