News April 3, 2025
సిద్దిపేట: బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం

బీజేపీ సిద్దిపేట జిల్లా పదాధికారుల సమావేశాన్ని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకోని జిల్లా అంతటా వారం రోజుల పాటు కార్యక్రమాల నిర్వహించాలని సూచించారు.
Similar News
News April 4, 2025
ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపన్యాసంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 10 నుంచి ఇవాళ్టి వరకు జరిగాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పాటు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
News April 4, 2025
మీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీశ్ రావు

TG: HCU భూముల విషయంలో నిలదీసినందుకు విద్యార్థులు, BRS నేతలు, సోషల్ మీడియా వారియర్స్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని BRS MLA హరీశ్ మండిపడ్డారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఇలా ఎంత మందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ గారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? మీ పిట్ట బెదిరింపులకు భయపడం’ అని ట్వీట్ చేశారు.
News April 4, 2025
మద్యం కుంభకోణం.. కసిరెడ్డికి షాక్

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల సీఐడీ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసులకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.