News October 10, 2025
సిద్దిపేట: బీసీ రిజర్వేషన్లపై స్టే.. అంతా సైలెంట్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు కలిపి బీసీలకు 225 దక్కగా, తాజా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 327కు పెరిగింది. కోర్టు స్టే కారణంగా పెరిగిన ఈ స్థానాల భవితవ్యంపై అయోమయం నెలకొంది.
Similar News
News October 10, 2025
AP అప్‌డేట్స్ @10AM

*రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలు. ఎమర్జెన్సీ సహా అన్నిరకాల వైద్యసేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. రూ.650 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించాయి.
*మంత్రివర్గ సమావేశం ప్రారంభం. 30 అంశాలపై చర్చ. రూ.1,14,821 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
*ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పొగాకు పరిశ్రమలో అగ్నిప్రమాదం. రూ.500 కోట్ల నష్టమని అంచనా.
News October 10, 2025
బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల భూమి స్వాధీనం

బంజారాహిల్స్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల విలువైన భూమి ఇది. ఫేక్ సర్వే నంబర్ 403/52తో ఓ వ్యక్తి భూమి తనదంటూ క్లెయిమ్ చేసుకొని ఫెన్సింగ్, షెడ్లు, బౌన్సర్లు, కుక్కలతో కాపలా ఏర్పాటు చేశారు. జలమండలి వాటర్ రిజర్వాయర్ పనులను అడ్డుకున్నాడు. దీనిపై హైడ్రా అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా, రెవెన్యూ, జలమండలి సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు.
News October 10, 2025
తెల్ల జుట్టుకు సొరకాయతో చెక్

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడుతోంది. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కాకుండా వంటింట్లో ఉండే సొరకాయ దీనికి పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. సొరకాయను ముక్కలు చేసి వారంపాటు ఎండబెట్టుకోవాలి. ఒక పాత్రలో కొబ్బరినూనె, ఎండబెట్టిన ముక్కలు వేసి మరిగించాలి. దీన్ని వడబోసి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని వారానికొకసారి తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది. <<-se>>#haircare<<>>