News October 29, 2025
సిద్దిపేట: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరికలు

మొంథా తుఫాను కారణంగా సిద్దిపేట జిల్లా రెడ్ అలర్ట్‌లో ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవడం, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు ముట్టుకోవడం, గాలి, దుమారం, తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవడం వంటివి చేయవద్దని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే JLM, ALM, LM, AE దృష్టికి తీసుకువెళ్లాలని విద్యుత్ అధికారులు సూచించారు.
Similar News
News October 29, 2025
పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కైకలూరులోని భైరవపట్నం పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగామని ఆయన తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలు జరగలేదని, సుమారు 3,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎస్పీ వివరించారు.
News October 29, 2025
కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జనగామ కలెక్టర్

జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 24/7 పని చేస్తుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు 90523 08621 సమాచారం అందించాలాన్నారు.
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.


