News June 24, 2024

సిద్దిపేట: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన దండు దుర్గేష్(34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న దుర్గేశ్ ఈనెల 13న భార్య పూర్ణిమతో గొడవ పడ్డాడు. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన దుర్గేశ్ ఈనెల 14న పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

మెదక్: చిల్డ్రన్ హోంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ చిల్డ్రన్ హోమ్ (బాలికల)లో పొరుగు సేవల పద్ధతిలో సేవిక, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 25వ తేదీలోపు మెదక్ కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు.

News November 6, 2025

డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

image

మెదక్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం (6 నుండి 12వ తరగతి) జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.

News November 6, 2025

కౌడిపల్లి: కోళ్ల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

image

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా.. రాంగ్‌రూట్‌లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.