News October 14, 2025

సిద్దిపేట: భూభారతి ధరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో భూ భారతి పెండింగ్ అప్లికేషన్ డిస్పోజల్ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ K.హైమావతి జూమ్ సమీక్ష నిర్వహించారు. RDO, తహశీల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో మిస్సింగ్ సర్వ్ నంబర్, పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్, DS, ఫీల్డ్ ఎంక్వైరీ, POB, సాదా బైనామా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు.

Similar News

News October 15, 2025

సిరిసిల్ల: జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలు

image

జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలు, హైస్కూలలో ఈ జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News October 15, 2025

భూసేకరణ పూర్తి చేయండి: కలెక్టర్

image

కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏలూరు పవర్ పేట గేటు వద్ద, దెందులూరు (M) సీతంపేట- శ్రీరామవరం, భీమడోలు రైల్వే గేట్, పూళ్ల, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటువంటి అభ్యంతరాలు, శాంతిభద్రతల సమస్యలు ఉండకూడదన్నారు.

News October 15, 2025

జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ట ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. మంగళవారం యార్డుకు 951 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్టంగా క్వింటాకు రూ.6,400, కనిష్టంగా రూ.5,000 ధర పలికింది. గోనెసంచుల్లో 38 క్వింటాళ్లు తీసుకొని రాగా గరిష్టంగా రూ. 6,000 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.