News October 14, 2025
సిద్దిపేట: మందుబాబులకు జరిమానా.. జైలు శిక్ష

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందికి రూ.23,300 జరిమానా, ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష, మరో వ్యక్తికి 2 రోజుల జైలు విధిస్తూ న్యాయమూర్తి వి.తరుణి తీర్పునిచ్చారని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో ఆయా చౌరస్తాలలో తనిఖీలు చేపట్టగా, 18 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
‘స్కాలర్‌షిప్స్ రాలేదు.. జీతాలు ఇవ్వలేం’

TG: ఉన్నత విద్యాసంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాయి. దాదాపు 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు విడుదల కాలేదని, వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే 50% కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం Way2Newsకు గోడు వెల్లబోసుకుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అడ్మిషన్లూ కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.
News October 14, 2025
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. మొత్తం 22 నామినేషన్లు

జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నామినేషన్‌ల స్వీకరణ కొనసాగుతోంది. మొదటి రోజున 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు దాఖలు చేయగా నేడు(2వ రోజు) 11 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.
News October 14, 2025
16న శ్రీశైలం వచ్చే భక్తులకు ముఖ్య గమనిక

ఈనెల 16న శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులకు అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, దోర్నాల మీదుగా శ్రీశైలం వచ్చే వారు తమ ప్రణాళికను సవరించుకోవాలన్నారు.