News August 20, 2025

సిద్దిపేట: మట్టి బతుకుల్లో ‘భరోసా’

image

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రాఫర్‌ల నుంచి ఫొటోలను ఆహ్వానించింది. అందులో సిద్దిపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ సతీశ్‌కు రైతు భరోసా నేపథ్యంలో తీసిన ఫోటో రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపికైంది. రాష్ట్రస్థాయి అవార్డుకు ఫొటో ఎంపిక కావడంతో ఫొటోగ్రాఫర్ సతీశ్‌కు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పురస్కారం అందించారు.

Similar News

News August 20, 2025

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ: నారా రోహిత్

image

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని హీరో నారా రోహిత్ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అతడు ఆసక్తిగా ఉన్నాడన్నారు. ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నట్లు మోక్షజ్ఞ చెప్పాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండొచ్చు. మూవీల కోసమే తన లుక్ మొత్తం మార్చేసుకున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటు బాలయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రోహిత్ చెప్పారు.

News August 20, 2025

LHPS రాష్ట్ర కమిటీలో ఇద్దరు కామారెడ్డి జిల్లా వాసులకు చోటు

image

లంబాడా హక్కుల పోరాట సమితిలో ఇద్దరు కామారెడ్డి జిల్లా వాసులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్ద కొడప్గల్ మండలం విఠల్‌వాడీ తండాకు చెందిన జాదవ్ శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శిగా జుక్కల్ మండలం దోస్పల్లికి చెందిన జాదవ్ లక్ష్మణ్‌ను జాతీయ కార్యవర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యవర్గం నియమించింది. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ చేతుల మీదుగా వీరు నియామక పత్రాలను అందుకున్నారు.

News August 20, 2025

వనపర్తి: ‘వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి’

image

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ గిరిధర్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని హెచ్చరించారు. విగ్రహాల ఏర్పాటుకు https://policeportal.tspolice.gov.in/index.htm అనే ఆన్‌లైన్ లింక్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.