News July 7, 2024
సిద్దిపేట: ‘మట్టి స్నానం.. మహా ఆరోగ్యం’
మట్టి స్నానంలో మహా ఆరోగ్యమని యోగా గురు వంశీకృష్ణ అన్నారు. అది యోగా పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేటలోని వయోల గార్డెన్‌లో యోగా గురువులు బొజ్జ ఆశోక్, ఎలిగేటి కృష్ణమూర్తి, పెద్ది మనోహార్ ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. మొదట కార్యక్రమానికి హాజరైన వారితో సూక్ష్మ యోగా ఆసనాల సాధన చేయించారు.
Similar News
News November 28, 2024
సిద్దిపేట: గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కమిటీ: మంత్రి పొన్నం
తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కమిటీ వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను మంత్రి తనిఖీ చేసి మాట్లాడారు. గురుకులాలు, హాస్టళ్లలో గతం కంటే మెరుగైన వసతులున్నాయని చెప్పారు. గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామని చెప్పారు.
News November 28, 2024
మెదక్: ‘వ్యవసాయమంటే దండగ కాదు పండుగ’
వ్యవసాయమంటే దండగ కాదు పండుగని నిరూపించిన ఘనత కాంగ్రెస్ దక్కుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ సదస్సులో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. అయనా మాట్లాడుతూ.. “వరి వేస్తే ఉరి కాదు సిరి” అని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు. సాగుకు సాంకేతికత జోడించి రైతులకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News November 28, 2024
పాపన్నపేట: పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన శాలను, మూత్రశాలలను పరిశీలించి ఉన్నత పాఠశాల HM దత్తు రెడ్డికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.