News February 25, 2025
సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 4, 2025
VZM: ఉపాధి హామీ పనులకు వెండర్లకు శిక్షణ

విజయనగరంలోని స్థానిక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వెండర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ పనులకు సంబందించి ఆన్‌లైన్‌లో టెండర్లు దక్కించుకోవడంపై అమరావతి పీఆర్ఆర్డీ కార్యాలయ అధికారి గోపీచంద్ వెండర్లతో పాటు అధికారులకు అవగాహన కల్పించారు. పనుల నిర్వహణపై పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారద పాల్గొన్నారు.
News November 4, 2025
NZB: గెలిచిన తర్వాత కూడా దేవుడి కోసం పనిచేయాలి: కవిత

బీజేపీ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు రాముడి పేరు చెప్పి ఓట్లడుగుతారని, వాళ్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దేవుడి కోసం పనిచేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం కవిత ఆదిలాబాద్‌లో మాట్లాడారు. జైనాథ్ ఆలయ గర్భగుడిలోకి వర్షం నీళ్లు వస్తున్నాయని, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు జైనాథ్ ఆలయాన్ని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News November 4, 2025
మంచిర్యాల: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే రైతులు టోల్ ఫ్రీ నంబర్లు 1967, 180042500333, కంట్రోల్ రూమ్ నంబర్ 6303928682కు సంప్రదించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 150, 97 పీఏసీఎస్, 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


