News October 30, 2025
సిద్దిపేట: ‘మాత శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’

మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 12 వారాలలోపు గర్భిణీలను తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రతి గర్భిణీపై కనీసం 4 సార్లు వైద్య విసిట్స్ నిర్వహించాలని సూచించారు. ప్రతి చెకప్‌లో HB లెవెల్స్, ఇతర పరీక్షలు చేయాలన్నారు.
Similar News
News October 31, 2025
ఏకత స్ఫూర్తిని నింపేందుకు 2k రన్: MHBD SP

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం 2k రన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుంచి అండర్ బ్రిడ్జి ద్వారా ఎన్టీఆర్ స్టేడియం వరకు రన్ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత పరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News October 30, 2025
మిర్యాలగూడ: చివరి ధాన్యం గింజ వరకూ కొంటా: కలెక్టర్

ఈ ఖరీఫ్‌లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని తెలిపారు. రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె అన్నారు.
News October 30, 2025
నష్టపోయిన తారవ్వకు బండి సంజయ్ ₹50 వేల సాయం

భారీ వర్షాలకు పంట నష్టపోయి కన్నీరుమున్నీరైన హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామానికి చెందిన రైతు తారవ్వకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. ఢిల్లీ నుంచి ఆమెకు ఫోన్ చేసి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సాయంగా ₹50 వేలు పంపిస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


