News October 27, 2025

సిద్దిపేట: ‘మేఘమా.. రైతును ఆగం చేయకుమా’

image

నంగునూర్ మండలంలో మేఘాలు దోబూచులాడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పనులు మానుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉంటున్నారు. వాన కురిసినట్టే చేసి మళ్లీ ఎండ దంచి కొట్టడంతో వారం రోజులుగా వడ్లు ఎండక రైతులు గోస పడుతున్నారు. ఈ వాతావరణ మార్పులు రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయి. వడ్లు ఎండి, ఎప్పుడు అమ్ముడుపోతాయోనన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జిలాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

Similar News

News October 27, 2025

VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలు

image

జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని DRO శ్రీనివాసమూర్తి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లో.. పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు కోసం 23, పేరు మార్పు కోసం 51, కొత్త పోలింగ్ కేంద్రాలుగా 122 ప్రతిపాదనలు గుర్తించబడినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు భారత ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు వెల్లడించారు.

News October 27, 2025

రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులకు గమనిక

image

ఇంటర్ విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలసి ఉంటుందని ఆర్ఐవో NSVL నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తమ పరీక్ష ఫీజును ఈ గడువులో చెల్లించాలని చెప్పారు. గడువు దాటితే రూ.1000 ఫైన్‌తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

News October 27, 2025

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: ఎంపీ

image

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా గత ఐదు, పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో గన్ కల్చర్ పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.