News January 6, 2025
సిద్దిపేట: యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు
యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం.. సిద్దిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి చిన్నకోడూరు వాసి చెందిన నిఖిల్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి 2 సార్లు గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ఆమె నగ్నచిత్రాలు ఉన్నాయని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. నిఖిల్‌కు మరో యువతితో నిశ్చితార్థం అవ్వడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News January 8, 2025
మెదక్: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించాలి: మంత్రి
ఆలోచనలతోనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతో పాటు గురువులేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్‌లోని ఒ ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మోహన్ రావు, విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
News January 7, 2025
మెదక్: గీత కార్మికులకు ప్రభుత్వం చేయూత: మంత్రి పొన్నం
గీత కార్మికులకు ప్రజా ప్రభుత్వం చేయూత ఇస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మొదటి విడతలో 15 వేల మంది గీతా కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేశామన్నారు. ఈనెల 25 లోపు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
News January 7, 2025
మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఎక్కడ..?: హరీశ్ రావు
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెల ఇస్తామన్న రూ.2500 ఇంకా ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి గద్దెనెక్కి13 నెలలు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటు అన్నారు. జార్ఖండ్‌లో సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్ నెల రోజులు కాకముందే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు రూ.2500 ఇస్తున్నారని తెలిపారు.