News March 23, 2025
సిద్దిపేట: యువతి అదృశ్యం- మిస్సింగ్ కేసు నమోదు

యువతి అదృశ్యమైన ఘటన వర్గల్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాచారం గ్రామానికి చెంది పర్స కృపారాణి (20) శుక్రవారం గ్రామంలోని కుట్టు మిషన్ నేర్చుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలో, బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికిన కనిపించలేదు. శనివారం యువతి తండ్రి పర్స స్వామి ఫిర్యాదు మేరకు గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 27, 2025
MNCL: ఏబీవీపీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పెంట మహేందర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏబీవీపీ అధ్యక్షుడిగా పాత మంచిర్యాలకు చెందిన పెంట మహేందర్ నియమితులయ్యారు. కరీంనగర్లో ఈనెల 25, 26 తేదీల్లో జరిగిన జోనల్ మీటింగ్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్‌ను కార్పొరేషన్ కార్యదర్శిగా నియమించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నట్లు మహేందర్ తెలిపారు.
News October 27, 2025
నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.
News October 27, 2025
NZB: లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలవగా ఒక్కో దరఖాస్తుకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. ఎక్సైజ్ DC వి.సోమిరెడ్డి పాల్గొన్నారు.


