News April 6, 2025

సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

image

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News September 14, 2025

ప్రతి ఒక విద్యార్థి మొక్క నాటి సంరక్షించాలి: అదనపు కలెక్టర్

image

ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం జరిగే ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో అన్ని పాఠశాలల్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. విద్యార్థులు తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి, దానితో సెల్ఫీ దిగి, ఆ ఫొటోను https://ecoclubs.education.gov.in/main పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆయన కోరారు.

News September 14, 2025

గద్వాల్ జిల్లా కోసం చేసిన ధర్నాలు, పోరాటాలు వైరల్

image

నడిగడ్డలోని ప్రజాపాలకులు కలిసి పోరాటం చేయడంతోనే గద్వాల జిల్లా ప్రత్యేక జిల్లాగా అయిందని, ఇందులో BRS పార్టీ చేసింది ఏమీలేదని అప్పటి ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. నిన్న తేరు మైదానం సభలో గద్వాల్‌ను జిల్లాగా చేశామని కేటీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా గద్వాల్ జిల్లా కోసం చేపట్టిన నిరసనలు, ధర్నాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజాపాలకులు అందరూ కలిసి పోరాటం చేస్తే జిల్లా అవతరించిందన్నారు.

News September 14, 2025

కృష్ణా జిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!

image

33 ఏళ్ల వయసులోనే 4 జిల్లాల్లో SPగా విధులు నిర్వహించి ప్రజాదరణ పొందిన యువ ఐపీఎస్ వానస విద్యాసాగర్ నాయుడు ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. నరసాపురానికి చెందిన ఆయన కోచింగ్ లేకుండానే సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. “మన ఊరు మన పోలీస్” వంటి వినూత్న కార్యక్రమాలతో క్రైమ్ రేటు తగ్గించి, రాష్ట్రంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా SPగా ఆయన విధులు నిర్వహించనున్నారు.