News February 25, 2025

సిద్దిపేట: యూనిఫాంలపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ పాఠశాల, వివిధ రకాల గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వచ్చే అకాడమిక్ సంవత్సరంలో స్కూల్ యూనిఫాం అందజేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గూర్చి జిల్లా అదనపు కలెక్టర్ గరిమ ఆగ్రవాల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అధికారులు సమీక్ష నిర్వహించారు.

Similar News

News February 26, 2025

హనుమకొండ: వేయి స్తంభాల ఆలయంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు 

image

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేయి స్తంభాల దేవాలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ డివిజన్ పోలీసులు భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ బందోబస్త్ ఏర్పాటుకు సంబంధించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. 

News February 26, 2025

హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

రానున్న వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు ప్రజలను వడగాలుల నుంచి అప్రమత్తం చేయడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రానున్న వేసవి కాలానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

News February 26, 2025

నర్సంపేట: తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతి

image

తండ్రి సంవత్సరికం మరుసటి రోజే కొడుకు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుపురంలో చోటుచేసుకుంది. చింతకాయల రాజశేఖర్ ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ తండ్రి మల్లయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మల్లయ్య సంవత్సరికం రోజే రాజశేఖర్ పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందగా, స్థానికులు నివాళులర్పించారు.

error: Content is protected !!