News August 26, 2025

సిద్దిపేట: యూరియా పక్కదారి పట్టిందా..?

image

యూరియాకు భారీ డిమాండ్ ఉండడంతో జిల్లాలో పక్కదారి పట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూలో రోజుల తరబడి ఎదురుచూసిన యూరియా రైతులకు అందడం లేదు. ఇక్కడికి రావాల్సిన నిల్వలు దారిమలిస్తున్నారా లేక కోటానే తగ్గించారా అనే విషయం తెలాల్సి ఉంది. ఈ నెలలో 13,090 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 2,920 టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. యూరియా సరఫరా పై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

Similar News

News August 26, 2025

HYD: వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలంటే!

image

వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల 22, 23 రెండు రోజులు అమావాస్య రావడంతో చవితి ఏ రోజు అనేది అర్థం కావడం లేదు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్‌నగర్‌లోని వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉ.11:05 నుంచి మ.1:40 వరకు మంచి ముహూర్తం అన్నారు. నిమజ్జనం సెప్టెంబర్ 6న చేయాలన్నారు.

News August 26, 2025

శ్రీకాకుళం: 28న DSC అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

image

డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28న జరగనుంది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీతో మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్‌లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువ పత్రాలను గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణతో 3 సెట్ల జిరాక్స్‌, 5 ఫొటోలతో కేటాయించిన తేదీ, వేదికకు సమయానికి హాజరవ్వాలన్నారు.

News August 26, 2025

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతల ప్రసంగాలు

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతల ప్రసంగాలు సాగాయి. జనహిత పాదయాత్రలో భాగంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించిన నేతలంతా స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని, ప్రజలు పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి నేతలు రాలేదని, స్థానిక ఎన్నికల గురించి వచ్చారని పలువురు చర్చించుకున్నారు.