News March 12, 2025

సిద్దిపేట: రవాణా శాఖకు గొప్ప పేరు తేవాలి: మంత్రి పొన్నం

image

AMVI లుగా నూతనంగా ఎంపికై నియామకాలు పొందిన వారు రవాణా శాఖకు గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో AMVI (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్)గా ఎంపికై నియామకమైన వారికి ఇచ్చిన శిక్షణ తరగతుల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగం ఒక బాధ్యత అని బాధ్యతతో పని చేయాలని సూచించారు. శిక్షణకు వచ్చిన AMVI లను అభినందించారు.

Similar News

News November 8, 2025

తిరుపతి: న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

image

న్యూ లుక్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ కోడ్‌తో తిరుపతిలో ఆయన పర్యటించారు. కెన్నెట్ అండర్సన్ రాసిన మ్యాన్ ఈటర్స్ అండ్ జంగల్ కిల్లర్స్ బుక్‌ను ఫారెస్ట్‌లో చదివి ఆహ్లాద వాతావరణంలో ఆనందంగా కనిపించారు. మామండూరు అందాలకు మంత్రముగ్ధుడయ్యారు. జలపాతం అందాలను చూసి మైమరచి పోయారు. 105 ఏళ్ల నాటి అతిథి గృహాన్ని సందర్శించడంతోపాటు ఆ ప్రదేశంలో మొక్కలు కూడా నాటారు.

News November 8, 2025

జీరో టిల్లేజీలో మొక్కజొన్న సాగు – సూచనలు

image

జీరో టిల్లేజి పద్ధతిలో వరిచేను కోశాక దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. బరువైన, తేమను నిలుపుకొనే నేలలో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి మొదటి వారం వరకు నాటవచ్చు. వరి కోత తర్వాత నేలలో తగినంత తేమ లేకపోతే ఒక తేలికపాటి తడిచ్చి పంట విత్తుకోవాలి. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. ఉండేట్లు విత్తాలి.

News November 8, 2025

60 ఏళ్ల వృద్ధుడు ₹1800 కోట్ల స్కామ్ వెలికితీత

image

MHలో Dy.CM అజిత్ పవార్ కుమారుడు పార్థ్ కంపెనీకి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం తీవ్రవివాదంగా మారింది. ₹1800CR విలువైన భూమిని ₹300CRకే కట్టబెట్టారు. ఈ స్కామ్‌పై ముందుగా దిన్‌కర్ కోట్కర్(60) IGR ఆఫీసుకు లేఖ రాసినా స్పందన రాలేదు. ఆ లేఖను తీసుకున్న ఓ సోషల్ యాక్టివిస్టు రికార్డులు టాంపర్ చేసినట్లు బయటపెట్టారు. అధికారుల విచారణలో అక్రమాలు నిజమని తేలడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.