News March 29, 2025

సిద్దిపేట: రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

image

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ వారు రూపొందించిన రాజీవ్ యువ వికాసం పోస్టర్లను శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రామాచారితో కలిసి పంపిణీ ఆవిష్కరించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

Similar News

News November 8, 2025

రూ.240 కోట్ల లాటరీ విజేత.. మన ఖమ్మం వాసే..!

image

దుబాయ్‌లో ఇటీవల నిర్వహించిన అతిపెద్ద లాటరీలో మన తెలుగింటి యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. రూ.240 కోట్ల బహుమతి గెలుచుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బోల్లా అనిల్‌కుమార్, వేంసూరు(M) భీమవరం గ్రామ వాసి. సాధారణ రైతు దంపతుల కుమారుడైన అనిల్, ఏడాదిన్నర క్రితం యూఏఈకి వెళ్లారు. ఇటీవల తన తల్లి పుట్టిన రోజు తేదీతో ఉన్న లాటరీ నెంబరుతో జాక్‌పాట్‌ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆయన జీవితం మారిపోయింది.

News November 8, 2025

GNT: సరిగ్గా 9 ఏళ్ల క్రితం అందరి మైండ్ బ్లాక్..!

image

2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేయటం ఉమ్మడి గుంటూరు జిల్లాలను కుదిపేసింది. నూతన రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్, రాజధాని రాక కారణంగా ప్రజల్లో పెరిగిన లావాదేవీలపై నోట్ల రద్దు పెను ప్రభావాన్ని చూపించింది. ఆ సమయంలో ఇతర జిల్లాల్లో లక్షల్లో లావాదేవీలు జరిగితే ఇక్కడ కోట్లల్లో జరిగాయి. ఆ పరిణామం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేని. దీనిపై మీ COMMENT.

News November 8, 2025

‘అలిపిరి’ అంటే అర్థం మీకు తెలుసా?

image

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలినడకన వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం ‘అలిపిరి’. సోపానమార్గంలో కనిపించే తొలి ప్రదేశం ఇదే. ఈ అలిపిరిని కొందరు ‘అడిప్పడి’ అని అంటారు. అడి అంటే అడుగున ఉన్న భాగం. పడి అంటే మెట్టు. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశమే ఇది. కొందరు దీన్ని అడిప్పుళి అని కూడా అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింతచెట్టు ప్రదేశమని దీని భావం. <<-se>>#VINAROBHAGYAMU<<>>