News April 14, 2025
సిద్దిపేట: రాజీవ్ యువ వికాస్.. నేడే చివరి తేదీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేటితో చివరి తేదీ ముగుస్తున్నందున సోమవారం సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కార్యాలయంలో ధ్రువ పత్రాలు సమర్పించాలని సూచించారు. సెలవు రోజులు అయినప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ కొనసాగుతుందని అన్నారు.
Similar News
News September 17, 2025
సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.
News September 17, 2025
స్మార్ట్ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News September 17, 2025
PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్‌లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.