News February 26, 2025
సిద్దిపేట: ‘రాబోయేది నానో తరం’

రాబోయేది నానో తరమని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక పేర్కొన్నారు. మంగళవారం నానో యూరియా, డీఏపీ వినియోగంపై ఫర్టిలైజర్ డీలర్లు, ఎఫ్పీసీ సంఘం సభ్యులకు సిద్దిపేటలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా, డీఏపీ స్థానంలో ఇఫ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ వినియోగం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు.
Similar News
News February 26, 2025
వనపర్తికి సీఎం రాబోతున్నారు..!

వనపర్తికి మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరోజు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం ఇచ్చారన్నారు. ఎంపీ మల్లు రవి, ఒబెదుల్లా కోత్వాల్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు తదితరులు సీఎంను కలిశారన్నారు.
News February 26, 2025
నాటుసారా రహిత జిల్లాగా తయారు చేద్దాం: అనంత కలెక్టర్

నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.
News February 26, 2025
MBNR: పునరావాస పనుల్ని వేగవంతం: కలెక్టర్

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసపనుల్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఉదండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరావాస పనులపై సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా పునరావస్తు కేంద్రాల్లో పనులను వేగవంతం చేసి వారికి అప్పగించాల్సిందిగా ఇరిగేషన్ ఇతర శాఖలకు కలెక్టర్ సూచించారు.