News April 7, 2025
సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్

ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబేట్ అవకాశం ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించినందున లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటిపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 8, 2025
ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
News April 8, 2025
మదనపల్లె: కానిస్టేబుల్ జయప్రకాష్ దుర్మరణం

మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ జయప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శనివారం తన కొడుకుకి ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం బెంగుళూరు వెళ్లాడు. సిటీలో హాస్పిటల్‌కు వెళ్తుండగా బుల్లెట్ బైక్ ఢీకొని తలకు బలమైన గాయలయ్యాయి. అక్కడ చికిత్స చేయించి, తిరుపతి నారాయణద్రి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు.
News April 7, 2025
సంక్షేమ వసతి గృహాలలో అంబేడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టరేట్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో జయంతి వేడుకలు ఏర్పాట్లకు సన్నాహాలు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.